జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా

జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు.

రేపు పరేడ్​ గ్రౌండ్స్​లో జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు జపాన్​ ప్రతినిధి బృందం హాజరవనుంది.

అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్​లో తెలంగాణ, కితాక్యుషూ పరస్పర సహకార ఒప్పందం చేసుకుంటాయి.

ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి జపాన్​ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కితాక్యుషూ సిటీని సందర్శించారు. అదే సందర్బంగా హైదరాబాద్​కు రావాలని మేయర్ ను ఆహ్వానించారు.

ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో ఉన్న సిటీ కితక్యూషూ. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.

Leave a Comment