శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని . ప్రజల రక్షణ కోసం రాజీ పడే ప్రసక్తే లేదని నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని గాంధీనగర్ సమీపంలోనీ టిడ్కో గృహాల్లో గూడూరు రూరల్ పోలీస్, సిబ్బందితో కలిసి రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.. ఈ కార్డెన్ సెర్చ్ లో అనుమానిత వ్యక్తులు,పాత నేరస్తుల ఇళ్ళు, పలు షాపులు, ఇతర ప్రాంతాల్లో అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు, రికార్డులు లేని వస్తువులు,వాహనాలు మొదలైన వాటివి గుర్తించుటకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, కొత్తగా, అనుమానం ఉన్న వ్యక్తులను ఆరా తీశారు. సుమారు 100 గృహాలుతో పాటు పలు వాహన రికార్డులు కూడా తనిఖీ చేశారు, ఈ తనికెల్లో ఎటువంటి పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాల ను సీజ్ చేశారు.. ఈ సందర్భంగా రూరల్ SI మోనోజ్ కుమార్ మాట్లాడుతూ
నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజలు వంతు సహకారాన్ని అందించాలని కోరారు. వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్ధానిక పోలీసులకు లేదా డయల్ 112 లేదా 100 కు తెలియజేయాలని కోరారు.*
*యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంగా, అజాగ్రత్తగా నడపవద్దని కోరారు.
