మున్సిపల్ యూనియన్ నుంచి ప్రధాన కార్యదర్శి గోపి బహిష్కరణ…….సి.ఐ.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి డి.కోటేశ్వరరావు.

తిరుపతి జిల్లా ఏ.పీ.మున్సిపల్ అండ్ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు) అనుబంధం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గోపి ని సి.ఐ.టి.యు యూనియన్ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు, యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి డి. కోటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.
పోరాడుతున్న కార్మికులకు, సమ్మె విచ్ఛిన్నంకై, ద్రోహానికి పాల్పడుతున్న నేపథ్యంలో గోపి ని యూనియన్ నుంచి బహిష్కరిస్తున్నట్టు డి. కోటేశ్వరరావు ఆ ప్రకటనలో వివరించారు. గత కొంతకాలంగా గోపి యూనియన్ వ్యతిరేక చర్యలకు పాల్పడటం, యాజమాన్య అనుకూల పద్ధతులు పాటించటం తదితర కారణాల రీత్యా యూనియన్ హెచ్చరికలు చేసిందని, మార్పు లేకపోగా సమ్మెలో ఉన్న కార్మికులకు, ఉద్యమానికి ద్రోహం చేయడానికి పూనుకున్న నేపథ్యంలో మున్సిపల్ యూనియన్ నుంచి గోపిని బహిష్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు డి. కోటేశ్వరరావు తెలిపారు.
ఇకపై గోపి కి సి.ఐ.టి.యు అనుబంధo ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదని, అధికారులు, కార్మికులు దీనిని గమనించాలని డి.కోటేశ్వరరావు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Leave a Comment