బాబు షూరిటీ -మోసం గ్యారెంటీ” ఇంటింటికి తెలపాలి


*బాబు షూరిటీ -మోసం గ్యారెంటీ” ఇంటింటికి తెలపాలి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ లు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్ ల పిలుపు ….*

*రాష్ట్రంలో రాజ్యమేలు తున్న రాక్షస పాలన తరిమికొట్టేందుకు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ తో ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.*

*గూడూరు పట్టణంలోని సి ఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో గూడూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి వైసిపి కార్యకర్తలతో నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.*

*ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుమాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, చేవూరు విజయ మోహన్ రెడ్డి, బత్తిన విజయకు మార్, భక్తవత్సల రెడ్డి,జడ్ పీ టీ సీ యామిని మహీధర్ రెడ్డి, పేర్నీటి కోటేశ్వర రెడ్డి, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మెట్ట రాధాకృష్ణారెడ్డి, మల్లు విజయకుమార్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, యద్దల మధుసూధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు,*

*ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచలేక వైసీపీ నాయకులు పై కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారన విమర్శించారు.*

*రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ పద్ధతిలో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని ఆరోపించారు.*

*స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు పరచకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.*

*సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడు తూ కార్యకర్తలకు పార్టీకి దూరం పెరిగిందని ఆ దూరాన్ని తగ్గించేలా ఎమ్మెల్సీలు అధిష్టానానికి తెలియజేయాలన్నారు. జరగనున్న అన్ని ఎన్నికల్లో వైసిపి సత్తా చాటాలన్నారు.*

*ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైసిపి కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టే అధికారుల అంతు చూస్తామని హెచ్చరించారు.*

*కార్యక్రమం ప్రారంభించడానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు.*

*ఈ కార్యక్రమంలో బాబు షురిటీ-మోసం గ్యారెంటీ కరపత్రా లను ఇంటింటికి వెళ్లి పంచిపెట్టి ప్రజలను చైతన్యపరిచేలా చేయాల న్నారు,*

*ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివా సులు, నియోజకవర్గ మండల కన్వీనర్లు ముల్లు విజయకుమార్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాయకులు కొండూరు సునీల్ కుమార్ రెడ్డి, మహిళా నాయకులు ఒడ్డురు శారద, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.*

Leave a Comment