గూడూరు 24 సొసైటీ(ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం) నూతన కార్యవర్గం సోమవారం నాడు స్థానిక 24 సొసైటీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు 24 సొసైటీ అధ్యక్షులుగా అల్లూరు కరుణాకర్ రెడ్డి, డైరెక్టర్ లుగా బచ్చల రవీంద్రారెడ్డి, దువ్వూరు రవీంద్రారెడ్డి నామినేట్ చేయడం జరిగింది.ఈసందర్భంగా వెడిచర్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మారుబోయన దామోదర్ ఎన్నిక కాబడిన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
