నానబెట్టిన మెంతి నీటి 6 ప్రయోజనాలు

నానబెట్టిన మెంతి నీటి 6 ప్రయోజనాలు

6 benefits of having soaked fenugreek water

న్యూస్ అప్ డేట్స్…2

హిందీలో మెతి దానా అని కూడా పిలువబడే మెంతి విత్తనాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మెంతి విత్తనాలు ఆహారానికి అద్భుతమైన రుచి ఇవ్వడం తో పాటు వివిధ సాధారణ రోగాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతాయి.

నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎందుకు మంచిదో వివరించుతాము:-

1.యాంటాసిడ్ వలె పనిచేస్తుంది:

ఆమ్లత్వం ఉన్నవారు ఆమ్లత్వ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ ఉదయాన్నే పర కడుపుతో ఒక టీస్పూన్ నానబెట్టిన మెంతి గింజలను తీసుకోండి.

2.మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది:

నానబెట్టిన మెంతి విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతాలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మెంతి నీరు తోడ్పడుతుంది. మొలకెత్తిన మెంతి విత్తనాలు నానబెట్టిన మెంతి గింజల కంటే 30 – 40 శాతం ఎక్కువ పోషకాలు కలిగి ఉండటాయి.

3.జీర్ణక్రియకు సహాయపడుతుంది:
నానబెట్టిన మెంతి గింజలు ఆమ్లతను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి, ఇది మంచి జీర్ణక్రియకు కూడా తోడ్పడుతాయి.

4.కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:

అధిక కొలెస్ట్రాల్‌ కలిగిన వారు నానిన మెంతి గింజలను తినాలి. నానబెట్టిన మెంతి గింజలు కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా సహాయపడతాయి.

5.పిత్త-కఫా లక్షణాలు కలవారికి మంచిది:

మేథి విత్తనాలు ప్రకృతిలో వేడిగా ఉంటాయి మరియు కఫా దోషo ఉన్నవారికి ఇది చాలా మంచిది. నానబెట్టిన, మొలకెత్తిన, మొత్తం మెంతి గింజలనువీరు తీసుకోవచ్చు
పిత్త దోషo ఉన్నవారు విత్తనాలను నానబెట్టిన నీటిని తీసుకోవాలి. ఇది ఆమ్లతను తగ్గించడంలో సహాయపడుతుంది.

6.మెంతి గింజలను తీసుకోవడానికి సరైన మార్గం:

ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన మెంతి గింజలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. మీకు దాని రుచి నచ్చకపోతే, పప్పులు మరియు కూరలకు చేర్చవచ్చు.

ఒక రోజులో ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజల కంటే ఎక్కువ తినకూడదు.

ఫలితాలను గమనించడానికి మీరు 21 రోజులుపాటు విత్తనాలను సేవించాలి.

Leave a Comment