*స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యం లో బల్లలు మరియు తాగునీటి స్వాకర్యం
స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో చంద్రగిరి మండలం కొట్టాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సుమారు 5 లక్షల విలువ చేసే 50 డెస్కలు మరియు ఆర్వో వాటర్ ప్లాంట్ ని చైర్మన్ ఉయ్యూరి శ్రీవ్యాల్, డైరెక్టర్లు మహేష్, మరుపూరి శేఖర్ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని హాజరైనారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు పులివర్తి నాని మాట్లాడుతూ స్ఫూర్తి ఫౌండేషన్ వారు పిల్లలకు కింద కూర్చోకుండా బల్లలు ఏర్పాటు చేయడం మరియు శుద్ధి చేసిన నీరుని పిల్లలు త్రాగడానికి ఆర్ఓ ప్లాంట్ ని వితరణ చేయడం చాలా గొప్పతనం అని, పిల్లలు కష్టపడి చదివి తల్లిదండ్రులకి గురువులకి, గ్రామానికి,చంద్రగిరి మండలానికి మంచి పేరు తీసుకురావాలని అప్పుడే మన పాఠశాలకు సహాయం చేసిన దాతలకు సంతోషాన్ని ఇచ్చి మరి కొన్ని స్కూల్లకి ఇలాంటి అవసరాన్ని తీర్చగలుగుతారని తెలిపారు.
ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే ఆ గొప్పదనం అంతా ఆరోజు నాకు చదువు చెప్పిన గురువులదే అని కొనియాడారు. అదేలాగా మీరు కూడావిద్యార్థి దశ నుంచే మంచి క్రమశిక్షణతో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో చురుగ్గా ఉంటారో వారు ఉన్నత స్థానంలో నిలబడతారని అన్నారు.
స్ఫూర్తి ఫౌండేషన్ వారు పేద పిల్లల చదువు కోసం స్కాలర్షిప్ రూపంలో ఆదుకుంటున్నారని, దూర ప్రాంతం నుంచి బడికి వెళ్లలేని పిల్లలకి సైకిళ్ళు పంపిణీ చేస్తున్నారని, నోట్ బుక్స్ మరియు విద్యార్థులకు ఎక్కడ ఏ అవసరం ఉన్న మేమున్నామని స్ఫూర్తి ఫౌండేషన్ వారు తెలంగాణ, ఆంధ్రాలో చాలామంది పిల్లలకి మంచి తోడ్పాటు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమం లోస్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ శ్రీవ్యాల్ మాట్లాడుతూ పేద పిల్లల కోసం స్ఫూర్తి ఫౌండేషన్ పనిచేస్తుందని అందులో భాగంగా ఈరోజు కొట్టాల జిల్లా పరిషత్ హైస్కూల్లో సుమారు 5 లక్షలు విలువ చేసే డెస్కులు మరియు ఆర్ఓ ప్లాంట్ ని వితరణ చేయడం జరిగిందన్నారు.దీనిని పిల్లలందరూ సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మంచి మార్కులు తెస్తారని ఆశిస్తూ అలాగే పదవ తరగతిలో 500 పైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికీ కార్పొరేట్ విద్యను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ డైరెక్టర్ మరుపూరి శేఖర్ మాట్లాడుతూ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని సొంత గ్రామానికి సహాయ సహకారాలు చేయాలని కోరుతూ అలాగే నేను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానని దానివలన ఈరోజు నేను స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా బల్లలు మరియు వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ లలిత కుమారి మాట్లాడుతూ పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాల నందు బల్లలు వితరణ చేయడం చాలా అభినందనీయమని పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో శుద్ధి చేసిన మంచినీటి సౌకర్యం కల్పించిన స్ఫూర్తి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం దాతలకి చంద్రగిరి ఎమ్మెల్యే పురవర్తి నాని చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్ బాబు, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సింగు సుధా, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కేశవులు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మొదలైన వారు పాల్గొన్నారు.
