- కుంభాభిషేక వేడుకల్లో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్. అధినేత గౌరీ శంకర్ దంపతులు
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం. పెళ్లకూరు
గ్రామంలో స్థానికంగా వెలసియున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు మూడవరోజు ముగియనుంది. చోళ రాజుల కాలంలో నిర్మించి విశేష పూజలు అందుకున్న ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో దానిని పూర్తిగా తొలగించి దాని స్థానంలో నూతన ఆలయాన్ని గ్రామస్తులంతా కలిసి చాగంటి లలితమ్మ భాస్కర రావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత గౌరీ శంకర్ సహకారంతో నిర్మించడం జరిగింది. ఈ నూతన ఆలయాన్ని నిర్మించి నేటికీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుష్కర (ద్వాదశ వర్షా) అష్ట బంధన, కుంభాభిషేక మహోత్సవములు ఈరోజుతో ముగియనుంది. ఈ కుంభాభిషేక మహోత్సవంలో త్యాగనం ట్రస్ట్ అధినేత గౌరీ శంకర్ ఆయన సతీమణి వరలక్ష్మి పాల్గొనే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయసం ఋషికేశవరావు, రాయసం శ్రీలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు..
