ప్రత్యేక విద్యుత్ అదాలత్ తో వినియోగదారుల సమస్యల పరిష్కారం!
విద్యుత్ అదాలత్‌ల ద్వారా వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి అన్నారు.బుధవారం పొదలకూరులో పొదలకూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించారు.రూరల్ డివిజన్ పరిధిలోని రాపూరు, నెల్లూరు రూరల్, పొదలకూరు, ముత్తుకూరు సబ్ డివిజన్ పరిధిలోని రాపూరు, సైదాపురం, పొదలకూరు, మనుబోలు, కలువాయి, నెల్లూరు రూరల్, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాలతోపాటు విరుపూరు,వెంకటాచలం, సెక్షన్ల విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ఈ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు మధుకుమార్, సభ్యురాలు విజయలక్ష్మి, ఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ విజయన్, నెల్లూరు రూరల్ డివిజన్ ఈఈ సోమశేఖర్‌రెడ్డి పాల్గొని విద్యుత్ వినియోగదారుల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. 18 అర్జీలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా అధిక మొత్తంలో కరెంటు బిల్లులు రావడం , లోవోల్టేజ్ సమస్యలు ,పాత విద్యుత్ వైర్లు మార్చాలని ఖాతాదారులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ వి. శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి మాట్లాడుతూ పోలాల్లో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురైనప్పుడు సంబంధిత ఏఈకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఏ ఈ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారని ఎఫ్ఐఆర్ ద్వారా నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు .అలాగే స్మార్ట్ మీటర్ల అమర్చుకుంటే కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని అపోహ మాత్రమేనన్నారు. పవర్ ఆఫ్ చేసినప్పుడు కెపాసిటర్ ఆఫ్ లోనే ఉఉండాలన్నారు. స్థానిక టిడిపి నాయకులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు,కోడూరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో 20 ఏళ్ళ కిందట నాటి విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన స్తంభాలు అమర్చారు కానీ వాటికి విద్యుత్తు తీగలను మార్చలేదన్నారు.అలాగే అవసరమైన చోట నూతన స్తంభాలు త్వరితగతను ఏర్పాటు చేయాలని విన్నవించారు. రెండేళ్ల కిందట మండలంలో విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేసే సమయంలో పలు అవకతవకలు జరిగాయని వాటిని ఒకసారి పున: పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు ఏడీ సుబ్రమణ్యం, ఏఈ శ్రీనివాస్ ఆయా మండలాల డిస్కం అధికారులు , వినియోగదారులు పాల్గొన్నారు.
