నాయుడుపేటలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ
నాయుడుపేట పట్టణంలో బుధవారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీ మందిరం వద్ద నుండి బజారు వీధి,దర్గా రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు 500 మీటర్ల పొడవు గల జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ షేక్. ఫజులుల్లా మాట్లాడుతూ79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ,మెప్మా,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
