కురుగొండ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దారా అంకయ్య
ఓజిలి మండలంలోని కురుగొండ సొసైటీ నూతన చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు దారా అంకయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు.కురుగొండ సొసైటీ కార్యాలయంలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో చైర్మన్ గా దారా అంకయ్య, డైరెక్టర్లు గా అలిమెలి మల్లికార్జున్ రెడ్డి, కొండూరు రవీంద్ర రాజు లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు వారికి శాలవాలు కప్పి,పూలమాలలు వేసి,ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలియజేశారు,అనంతరం సొసైటీ చైర్మన్ దారా అంకయ్య మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.తనను సొసైటీ చైర్మన్ గా నియమించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
