రైతన్నల అభివృద్దే కూటమి ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ
రైతన్నల అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. బుధవారం నాయుడుపేట పట్టణంలో సూపర్ సిక్స్ -సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా రైతు సంబర సభను నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని పిచ్చిరెడ్డి తోపు వద్ద గల విజయ గణపతి ఆలయం వద్ద నుండి గాంధీ మందిరం,బజారు వీధి,దర్గా రోడ్డు,అంబేద్కర్ విగ్రహం,శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు మీదుగా ఏఎంసీ కార్యాలయం వరకు భారీ టాక్టర్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలియజేశారు.రైతులను ఆదుకోవడంలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పరిపాలనా దక్షత గల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి,సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలియజేశారు.జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సూపర్ సిక్స్ పథకాలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుండడంతో కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు అందుకుంటుందని తెలియజేశారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏటా 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు మొదటి విడత రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు తెలియజేశారు.నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ మాట్లాడుతూ అభివృద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని,అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్,టిడిపి జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా వెంకటరమణారెడ్డి,నెలవల రాజేష్, పేరంశెట్టి శ్రీరాంప్రసాద్,సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,సంచి కృష్ణయ్య, విజయ్ కుమార్ నాయుడు,నానబాల సుబ్బారావు,అవధానం సుధీర్, చిట్టేటి చెంచయ్య,పరస రాజా,కాపులూరు చక్రపాణి,పలుకూరు ముత్యాలయ్య,బల్లి ముత్యాలయ్య,మొండెం బాబు, చెందేటి సుజాత,తుపాకుల కన్నెమ్మ,సంపూర్ణమ్మ,పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
