Advertisements

ఏపీలో మందు బాబులకు పర్మిట్ రూమ్ లు

ఏపీలో మందు బాబులకు పర్మిట్ రూమ్ లు
ఆంధ్రప్రదేశ్ లోని మందు బాబులకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. ఏపీలో పర్మిట్ రూమ్‌లు అనుమతించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఎంఎస్ నెంబర్ 273కి అనుమతిం చింది. పర్మిట్ రూమ్‌లకు సంబంధించి నియమ నిబంధనలను ఉత్తర్వుల్లో పేర్కొంది.

పర్మిట్ రూమ్‌లు అందు బాటులో లేకపోవడం వల్ల బహిరంగంగా మద్యపానం చేస్తున్నారని, దీనికారణం గా సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించిన ప్రభుత్వం పర్మిట్ రూమ్‌ల కు అనుమతి ఇచ్చింది.

ఇందుకోసం నవంబర్ 10వ తేదీలోపు 2025-26 సంవత్సరానికి సంబంధించిన లిక్కర్ పర్మిట్ రూమ్ లైసెన్సు రుసుము చెల్లించాలి. దీనికి మద్యం దుకాణాల లైసెన్సుదారులు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

2025- 26 సంవత్సరానికి మాత్రమే ఆ పర్మిట్ రూమ్ లైసెన్స్ వర్తిస్తుందని తెలిపారు.పర్మిట్ రూమ్ లైసెన్స్‌కు యాన్యూవల్ ఫీజుగా రూ.55లక్షల వరకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న వారికి రూ.5లక్షలు ఫీజు. అదేవిధంగా రూ.65 నుంచి రూ.85లక్షల రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న వారికి రూ.7.50లక్షలు ఫీజు నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పర్మిట్ రూమ్ ఫీజును మొత్తం ఒకేసారి చెల్లించా ల్సి ఉంటుంది. పర్మిట్ రూమ్ ప్లింత్ ఏరియా వెయ్యి చదరపు అడుగులకు మించకుండా ఉండాలి. ఇది తప్పనిసరిగా మద్యం దుకాణం పక్కనే ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ పర్మిట్ రూమ్ లలో వంటకాలు అనుమతి లేదు. రెడీ టూ ఈట్ స్నాక్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. తాగునీరు, చేతులు కడుక్కోవడానికి నీరు, పారిశుద్ధ్య సౌకర్యా లు తప్పనిసరిగా అందు బాటులో ఉండాలి. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మంగళవారం సాయంత్రం ఇందుకు సం బంధించిన మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ మద్యపానాన్ని నియంత్రించడమే ఈ పర్మిట్ రూంల అనుమ తుల ఉద్దేశమని పేర్కొన్నారు.

Leave a Comment

ghostwriter service
bachelorarbeit ghostwriter
avia masters
ghostwriter köln
ruletka kasyno
ghostwriter seminararbeit
ghostwriter seminararbeit