వినాయక విగ్రహాలు ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలి- డీఎస్పీ చెంచు బాబు*
వినాయక చవితి సందర్భంగా నాయుడుపేట పట్టణం తోపాటు మండలంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులుతీసుకోవాలని నాయుడుపేట డిఎస్పి చెంచు బాబు అన్నారు.శనివారం వినాయక ఉత్సవాల కమిటీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసేవారు పోలీస్ విద్యుత్ మున్సిపల్ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు.స్థానికులకు ఇబ్బందులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చూడాలన్నారు.విద్యుత్ సరఫరా లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి నిమజ్జనం చేసే వరకు నిర్వాహకులు రాత్రుల్లో సైతం విగ్రహాల వద్ద ఒకరిని కాపలాగా ఉంచాలని సూచించారు.ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని తెలియజేశారు.నిబంధనలు పాటించని వారి పై చర్యలు తీసుకుంటామన్నారు.డీఎస్పీ వెంట నాయుడుపేట అర్బన్ సీఐ బాబి ఉన్నారు.
