జాతికి క్షమాపణ చెప్పాలి: నారా లోకేశ్
జగన్ పై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు
స్వాతంత్ర్య దినోత్సవాన జాతీయ జెండాను ఎగరేయలేదని ఆరోపణ
ఇది స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమేనని వ్యాఖ్య
జగన్ అహంకారంతోనే ఇలా ప్రవర్తించారని ధ్వజం
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి పవిత్రమైన రోజున జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి జగన్ గైర్హాజరు కావడం దేశాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకపోవడం కేవలం అహంకారం మాత్రమే కాదు, మన దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రంగా అవమానించడం” అని వ్యాఖ్యానించారు. జగన్ చర్య, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలకు విఘాతం కలిగించేలా ఉందని విమర్శించారు.జగన్ తన వైఖరితో దేశ గౌరవాన్ని కించపరిచారని ఆరోపించిన లోకేశ్, ఈ చర్యకు గాను ఆయన తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
