ధరణి ద్వారా విలువైన భూములను బినామీల పేర్ల

రేవంత్ రెడ్డి అమ్ములపొది లో మరో ఆయుధం ధరణి పై విచారణ.కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్,కాళేశ్వరం, కార్ రేసింగ్ స్కాం లకే పరిమితమైన విచారణ ఇప్పుడు ధరణి పై మొదలు కాబోతుంది.kcr సంపాదించిన లక్షల కోట్ల అక్రమ సంపాదన లో మొదటిది కాళేశ్వరం అవుతే రెండవది ధరణి. ధరణి ద్వారా విలువైన భూములను బినామీల పేర్లమీదకు మార్చడం తో వేలకోట్లు కొల్లకొట్టినట్లు ప్రజలకు తెలుసు.సోమేష్ కుమార్ ఆధ్వర్యం లో ఈ స్కాం జరిగినమాట వాస్తవం.ధరణి పేరుతో తెలంగాణ లో ఉన్న వేల ఎకరాలు తమ పేర్లమీద మార్చుకోవడం తో పాటు పాత రికార్డ్స్ మొత్తం నాశనం చేసినట్లు ప్రభుత్వం పూర్తి సమాచారం సేకరించినట్లు సమాచారం.జంట నగరాలలో విలువైన భూములు,రికార్డ్ లలో బినామీ పేర్లమీద మార్చి షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లు కట్టి వాటిలో ktr బినామీగా ఉన్నట్లు సమాచారం.రింగ్ రోడ్ చుట్టూ పక్కల వేల ఎకరాల భూమి బినామీల పేర్లమీద మారచినట్లు..ఎస్సెండ్ మరియు ఎండోమెంట్ భూములు, కరీజ్ ఖాతా భూములు పాకిస్తాన్ పారిపోయిన కాంధశికుల భూములు రికార్డ్ లనుండి మాయం అయినట్లు గా ప్రభుత్వం గుర్తించింది.కొన్ని నెలలుగా రేవంత్ ప్రభుత్వం గట్టు చప్పుడు కాకుండా కొందరు ప్రభుత్వం ఉద్యోగులు రెవెన్యూ సిబ్బంది తో సాక్షాలు సేకరించినట్లు సమాచారం.అంటే త్వరలో kcr మెడకు మరో ఉరితాడు బిగియనున్నది.ఆగస్ట్ 15 నాటికి రైతుల భూసమస్యలకు పరిష్కారం చూపిస్తాం అని రెవెన్యూ సదస్సులు పెట్టీ మరీ వాగ్దానం చేసిన ప్రభుత్వం .ఇప్పుడు మొదటిగా ప్రభుత్వ భూములు మాయం చేసిన బడాబాబుల మీద చర్యలకు సిద్ధం అవుతుంది.హైదరాబాద్ కేంద్రం గా కొందరు బడా బిల్డర్స్ చేతుల్లో వేల ఎకరాలు ఎలా వచ్చాయో ఎంక్వైరీ వేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

Leave a Comment