నాయుడుపేట తహసిల్దార్ ఎం. రాజేంద్ర,సర్వేయర్ చరణ్ లను బదిలీ చేయాలి

వైసిపి నాయకులు కార్యకర్తలకు సహకరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న నాయుడుపేట తాసిల్దార్ రాజేంద్ర, సర్వేయర్ చరణ్ లను బదిలీ చేయాలని నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని బిరదవాడ గ్రామానికి చెందిన పనబాక గంగబాబు సోమవారం జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాయుడుపేట డి.టి గా బాధ్యతలు చేపట్టి,వైసీపీ నాయకుల సహకారంతో ఇంచార్జి తహసీల్దార్ గా కొనసాగుతున్నారని తెలిపారు.వైసిపి నాయకులు, కార్యకర్తలకు పనులు చేసి పెడుతూ తెలుగుదేశం పార్టీ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రాజేంద్రను ఇన్చార్జి తాసిల్దారుగా కొనసాగిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. నాయుడుపేట సర్వే చరణ్ సైతం ఇన్చార్జి తహసిల్దార్ రాజేంద్ర బాటలో నడుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను,కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.వారిద్దరిని బదిలీ చేయించి నిజాయితీగా,పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే వారిని పర్మినెంట్ తహసిల్దార్, సర్వేలు గా నియమించాలని పనబాక గంగబాబు కోరారు.

Leave a Comment