తండ్రి కూతుళ్ళ ఆస్తివివాదంలో బలి పశువు అయిన ప్రభుత్వ ఉద్యోగి

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో ఆర్డిఓ ఆఫీస్ వద్ద ఉపాధ్యాయుడు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని దేహశుద్ధి చేశామని చెప్పిన సంఘటనలో మహిళ యొక్క తండ్రి మరియు ఆ ఉపాధ్యాయుడు మీడియాకు ఇచ్చిన వివరణ..
మహిళ తండ్రిదేవల్ల రామిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ గూడూరు ఆర్డీవో ఆఫీస్ కు భూ వివాదం సంబంధించి ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చాను.. అదే సమయంలో అక్కడ వేరే పనిమీద ఆర్డిఓ గారికి అర్జీ ఇవ్వడానికి టీచర్ అయినటువంటి గంపల శ్రీనివాసులు కూడా అక్కడే ఉన్నారు.. నాకు గంపల శ్రీనివాసులు గతంలో పరిచయం ఉంది కనుక ఆర్డిఓ ఆఫీస్ లో ఎదురుపడితే ఒకరు ఒకరు ఎలా ఉన్నావో అని మాట్లాడుకుంటున్నాం, అదే సమయంలో నా కూతురు నా అల్లుడు మరో ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూశారు. నాకు టీచర్ సహాయం చేస్తున్నట్టు నా ఆస్తి విషయంలో అతను తల దురస్తున్నట్టు వాళ్లు అనుకొని అపోహ పడి నా కూతురు తిరువూరు సుమన మరియు అల్లుడు తిరుమూరు సాయి మనోహర్ రెడ్డి మరో ఇద్దరు వ్యక్తులు గిద్దలూరు వంశీ రెడ్డి వారి సతీమణి ఈ నలుగురు కలిసి అసభ్య పదజాలం వాడుతూ నా కూతుర్ని ఉపాధ్యాయుడు ఏదో అసభ్యంగా మాట్లాడినట్టు కల్పించి దారుణంగా టీచర్ గారిని కొట్టారు అని మహిళా తండ్రి తెలియజేశాడు. నన్ను పలకరించడమే అతనికి శాపమైనదని వాపోయాడు. ఉపాధ్యాయుడునీ సంఘటనపై వివరణ కోరగా నేను పదిమందికి చదువు చెప్పేవాడిని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాడిని కాదు రామిరెడ్డి అనే ఆయన నన్ను పలకరిస్తే పలకరించి మాట్లాడుతున్నాను అంత లోపలే నన్ను అనవసరంగా కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేసి మీడియాకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై నేను ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను పోలీసు వారే నాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అని తెలియజేశారు.

Leave a Comment