ఎన్ ఎస్ స్కూల్ విద్యార్థి శ్రీకృతి సిల్వర్ మెడల్

ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో బి ఎన్ ఎస్ స్కూల్ విద్యార్థికి సిల్వర్ మెడల్
ఒంగోలులో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ నందు వెంకటగిరి పట్టణంలోని బిఎన్ఎస్ పాఠశాల విద్యార్థి అన్నదానం శ్రీకృతి. సిల్వర్ మెడల్ సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ విజయానికి కారణమైన SS స్పోర్ట్స్ అకాడమీ కరాటే కోచ్ శివశంకర్ ని మరియు విద్యార్థి శ్రీకృతిని.కరస్పాండెంట్ ఫణిరాజశంకర్ అభినందించారు.
తమ పాఠశాల విద్యార్థిని గతంలో కూడా సినీ హీరో సుమన్ చేతుల మీదుగా కరాటే విభాగంలో పురస్కారం పొందారని గుర్తుచేశారు. ఆర్చరీ మరియు కరాటే విభాగంలో పలు మెడల్స్ సాధించిన విద్యార్థి శ్రీకృతిని. మరో మారు అభినందించారు. తమ పాఠశాలలో విద్యతోపాటు. డాన్స్,కరాటే,సంగీతం, లాంటి ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా విద్యార్థినీ,విద్యార్థులకు తర్ఫీదును ఇచ్చి, జిల్లా రాష్ట్రస్థాయిలలో జరిగే కాంపిటేషన్ పోటీలకు పంపడం జరుగుతుందని తెలియజేశారు.

Leave a Comment