లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తాండూరు పురపాలక సీనియర్ అసిస్టెంటు
రంగారెడ్డి జిల్లా,: తాండూరులో అవినీతి మరొకసారి వెలుగులోకి వచ్చింది. తాండూరు పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి. రమేష్ అనే అధికారి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.ఫిర్యాదుదారుడు తాను నిర్మించుకున్న ఒక షెడ్డుకు ఇంటి నంబర్ కేటాయించాలనగా, అందుకు ప్రతిగా ₹15,000 లంచం కోరిన రమేష్‌ను, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే ACB అధికారులు పట్టుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం తరచూ లంచగొండితనాన్ని అరికట్టేందుకు ప్రజలకు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. ఎవరికైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరిన పక్షంలో, వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని సూచించారు.టోల్‌ఫ్రీ నెంబర్: 1064
వాట్సాప్: 9440446106
ఫేస్‌బుక్: Telangana ACB
ఎక్స్ (Twitter): @TelanganaACB
వెబ్‌సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదు దారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని అధికారులు స్పష్టం చేశారు.
