రాష్ట్ర అభివ్రుద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన -ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్
-గూడూరు నియోజకవర్గం రైతుల ఖాతాల్లో 14 కోట్ల 91 లక్షలు అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు జమ
గూడూరు, ఆగస్టు-2 (Wisdom)
గూడూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పాల్గొని రైతులకు అన్నదాత సుఖీభవ నగదు చెక్కులు అందజేశారు.పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్,సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పధకం కింద రైతులకు నగదు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ..మొదటి విడతగా రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయల వంతున నగదు జమ చేయడం జరిగిందన్నారు.రెండో విడత అక్టోబరు,మూడో విడత నగదు జనవరిలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. PM కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద గూడూరు మండలం లో 5188 మందికి గాను 3 కోట్ల 40 లక్షలు,చిల్లకూరు మండలం లో 4591 మందికి గాను 3 కోట్ల 12 లక్షలు,కోట మండలం లో 3745 మందికి గాను 2 కోట్ల 51 లక్షలు ,వాకాడు మండలంలో 3795 మందికి గాను 2 కోట్ల 51 లక్షలు,చిట్టమూరు మండలం లో 4898 మందికి గాను 3 కోట్ల 37 లక్షలు,మొత్తం నియోజకవర్గం నందు 22217 మందికి గాను 14 కోట్ల 91 లక్షలు అందిస్తున్నాం అని ఎమ్మెల్యే తెలిపారు. వైకాపా పాలనలో రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. రైతుల అభివ్రుద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులకు వివరించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని, ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,సొసైటీ అద్యక్షుడు కరుణా కర్ రెడ్డి,నాయకులు శీలం కిరణ్ కుమార్,భాస్కర్ రెడ్డి,పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య,వెంకటేశ్వర్లు రాజు, ఇజ్రాయెల్,దువ్వూరు రాజశేఖర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,కిషోర్ నాయుడు,రహీమ్,వాటంబేటి శివకుమార్,మట్టం శ్రావణి రెడ్డి ,గుండాల లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు.


