Advertisements

నాల్గు కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంపై ఓ ప్రైవేటు వ్యక్తి కన్ను..

పొదలకూరు : నాలుగు కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కొట్టేసేందుకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన ఓ ప్రైవేట్ వ్యక్తి ఆశ అడియాశ గా మారింది.పొదలకూరు నడిబొడ్డున ప్రధాన రహదారి పై 4 కోట్ల విలువైన 34 అంకణాల స్థలాన్ని కొట్టేసేందుకు అతను చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ వ్యక్త సడి చప్పుడు కాకుండా ఒకపక్క పోలీస్ స్టేషన్, మరోపక్క  పాత పంచాయతీ ఆఫీస్ రెండిటి మధ్య ఉన్న 34 అంకణాల స్థలాన్ని తన పిత్రార్జితంగా మార్చుకునేందుకు పలువురు డెత్ సర్టిఫికెట్లతో  ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అక్రమ రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించాడు కానీ ,పొదలకూరు సబ్ రిజిస్టార్ ఇది నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తాను రిజిస్ట్రేషన్ చేయలేనని తేల్చి  చెప్పి డాక్యుమెంట్లను తిరిగి ఇచ్చేశారు.దీంతో  ఎలాగైనా ఆ స్థలాన్ని చేజేక్కించుకోవాలనే దురుద్దేశంతో తన బావ మరిది రెవెన్యూ శాఖ కీలక పోస్టులో ఉండటంతో తన సహకారం తీసుకున్నారు.ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు  పలు ఫేక్ డాక్యుమెంట్లను ప్రోగు చేసుకున్నారు. ఇప్పటికీ అదే ప్రయత్నంలో ఉన్నారనే విమర్శలు ఉన్నాయి.  పొదలకూరు లో మెయిన్ రోడ్డు పక్కనే పంచాయతీ కార్యా లయం వద్ద సర్వేనెం 191 -1ఎ లో  34 అంకణాల ఖాళీ స్థలం ఉంది. దీని విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుంది. ఇక్కడ గతంలో వీఆర్ఎ వ్యవస్థ కొనసాగుతున్న సమయంలో గ్రామ చావడి శిథిల భవనం ఉండేది. కూలే స్థితిలో ఉండటంతో శిథిల భవనాన్ని అధికారులు తొలగించారు. అంతకు మునుపే అక్కడ ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఉండేది. తర్వాత పంచాయతీ కార్యాలయ భవనంలో స్థలం కలుస్తుండటంతో ఏ శాఖకు చెందిన స్థలమో గుర్తించి రికార్డు పరంగా స్వాధీనం చేసుకోకుండా పంచాయతీ భవనాన్ని ఖాళీ స్థలంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి రాపూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఈ భవనానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.తర్వాత భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోవడంతో కాలక్రమంలో పదిహేను ఏళ్ళకు పైగా స్థలం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో 2017 లో  వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రవిశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ అధికారి భవనాన్ని ఖాళీ స్థలంలో నిర్మించాలని చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న సమయంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు అడ్డుకున్నారు. స్థలం ఏ శాఖదైనప్పటికీ ఇంత కాలంగా ఖాళీగా పంచాయతీ ఆధీనంలో ఉన్న కారణంగా తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పంచాయతీ తీర్మానం లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని వాగ్వాదానికి దిగారు. దీంతో వీఆర్వోలు పనులను నిలుపుదల చేసి వెళ్లిపోయారు. రెవెన్యూ స్థలంలో గ్రామ రెవెన్యూ అధికారి భవనం నిర్మించాలంటే పంచాయతీ అనుమతీ ఎందుకని రెవెన్యూ,పంచాయతీ అధికారులు 2017 మే నెలలో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెం.83/17  కేసు ఆరేళ్ల పాటు  గూడూరు కోర్టు లో జరిగి చివరికి  2023 ఫిబ్రవరిలో కొన్ని నియమ నిబంధనలతో  రెవిన్యూ భవనం నిర్మించేందుకు  అనుమతిస్తూ తీర్పు నిచ్చింది.జిల్లా కలెక్టర్ ఇందుకు సంబంధించిన అనుమతులు ఇచ్చారు.  అయితే ఇది ఇలా ఉండగా 2023 సెప్టెంబర్ నెలలో పొదలకూరు సంగం రోడ్డుకు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి ఈ స్థలం తనకు  పిత్రార్జితంగా లభించిందని పలువురి  డెత్ సర్టిఫికెట్లు పెట్టి ఆ స్థలాన్ని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని పొదలకూరు సబ్ రిజిస్టార్ కి డాక్యుమెంట్ పత్రాలను అందించారు. ఆ డాక్యుమెంట్లు నియమనిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని సబ్ రిజిస్టార్, రిజిస్ట్రేషన్ చేయకుండా త్రోసిపుచ్చారు. వారి డాక్యుమెంట్లను వారికి రిటర్న్ ఇచ్చేశారు.ఆ ప్రైవేటు వ్యక్తి ఎలాగైనా ఆ ప్రభుత్వ స్థలాన్ని తాను చేజెక్కించుకోవాలనే ఉద్దేశంతో   విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన రహదారిపై, కమర్షియల్ గా ఉపయోగపడే, రెండు ప్రభుత్వ ఆఫీసుల మధ్య ఉండే ఈ 4 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.  రెవెన్యూ ,పంచాయతీ అధికారులు పరిశీలించి అక్కడ ప్రభుత్వ భవనాలు కానీ,  ఇతర  ప్రజా సముదాయాన్ని కానీ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు. లేదంటే ఆ వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాను వశపరుచుకునేలా  ఉన్నారని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇప్పటికే పొదలకూరు తహసిల్దార్ కి పలుమార్లు టిడిపి నాయకులు వినతి పత్రం అందించారు అయినా స్పందన లేక స్పందన లేదు.ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave a Comment

ghostwriter service
bachelorarbeit ghostwriter
ruletka kasyno
ghostwriter seminararbeit
avia masters
ghostwriter köln
ghostwriter seminararbeit