రైళ్లలో దొంగతనాలు చేస్తున్న గజదొంగ అరెస్ట్
కదులుతున్న రైళ్లు, నిద్రలో ఉన్న ప్రయాణికులే ఇతని టార్గెట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 కి పైగా కేసులు
ముద్దాయి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు,రెండు ల్యాప్ టాప్స్,143 గ్రాముల బంగారం రికవరీ
కదులుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గజ దొంగను అరెస్ట్ చేసిన నెల్లూరు రైల్వే పోలీసులు…
రైల్వే డిఎస్పి తెలియజేసిన వివరాల మేరకు నెల్లూరు పోలీసు సబ్ డివిజన్ లోని నెల్లూరు,గూడూరు కావలి తదితర రైల్వే స్టేషన్లలో జరిగిన రైలు దొంగతనాలు కేసులో దర్యాప్తులో భాగంగా రైళ్లు తనిఖీ చేయగా నెల్లూరులో జన శతాబ్ది రైల్లో అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఇతను పాత నేరస్తుడని గతం లో ఇతని పై హైదరాబాదు,విజయవాడ,కర్నూలు, నంద్యాల,తిరుపతి రైల్వే స్టేషన్లలో దొంగతనాలకు సంబంధించి 10కి కేఫీల్లో నేరస్తుడుగా ఉన్నాడని తెలిసిందనిముద్దాయి నుండి రెండు సెల్ ఫోన్లు రెండు లాప్టాప్ లు 143 గ్రాముల బంగారం మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు విలువచేసే సొత్తును రికవరీ చేశామని ముద్దాయి దివ్యాంగుడుగా రైల్వే టికెట్ తీసుకుని రాత్రి సమయాల్లో ఏసీ బోగీలోకి ప్రవేశించి నిద్రపోతున్న ప్రయాణికులు వద్ద ఉన్న బ్యాగులు ఇతర విలువైన వస్తువులు దొంగతనాలు చేస్తుంటాడని డిఎస్పి తెలియజేశారు…
