నెల్లూరు నగరంలో ఆగని హత్యలు
నెల్లూరులో పట్టపగలు నడి బజార్లో మరో దారుణ హత్య
షేక్ లైక్ అనే 30 ఏళ్ల యువకుడిని మూలపేటలోని అలంకార్ సెంటర్లో వెంబడించి నరికి చంపిన దుండగులు
నడిరోడ్డుపై ఇద్దరు యువకులు కత్తులతో తరిమి తరిమి లైక్ ను నరికి చంపినట్టు తెలుపుతున్న స్థానికులు
దుండగులుకు మృతుడు లైక్ కు పాత కక్షల నేపథ్యంలోని హత్య జరిగి ఉంటుంది అనుమానిస్తున్న పోలీసులు
హంతకులు మృతుడు లైక్ స్నేహితులు నూర్, మరో వ్యక్తిగా ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు
నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని అలంకార్ సెంటర్లో లైక్ అనే 30 ఏళ్ల యువకుడ్ని అందరూ చూస్తుండగా వెంబడించి తరుముకుంటూ వెళ్లి కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. పాత గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
