Advertisements

రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్, బెయిల్ పై విడుదల – ఫోన్ స్వాధీనం !

రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్, బెయిల్ పై విడుదల – ఫోన్ స్వాధీనం !

వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుగాఎన్నికలకు ముందు పని చేసిన రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. కానీ ఆయన ఫోన్ ను సీజ్ చేశారు. ఫోన్ తో సహా ఒంగోలు వచ్చిన ఆయన స్టేషన్లోకి ఫోన్ తీసుకెళ్లలేదు. తన లాయర్ గా పోలీసులకు పరిచయం చేసిన వైసీపీ లీగల్ సెల్ ఇంచార్జ్ వద్ద ఫోన్ ఉంచి వచ్చారు. పోలీసులు ఆ విషయం తెలుసుకుని లాయర్ ను పిలిపించి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

గతంలో టీడీపీపై, జనసేన పార్టీపై ఆయా పార్టీల నేతలపై ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు పెట్టేవారు. అత్యంత ఘోరంగా ఆ ట్వీట్లు ఉండేవి. ఓ సారి అమ్మాయిల ఫోటోలకు చంద్రబాబు, లోకేష్, పవన్ ముఖాలను మార్ఫింగ్ చేసి పెట్టారు. అది వివాదాస్పదమయింది. అలాగే ఫైబర్ నెట్ నుచి ప్రజాధనం అక్రమంగా రెండు కోట్ల రూపాయలు కొల్లగొట్టడంతో పాటు మరికొన్ని కేసులు ఉన్నాయి. వాటన్నింటిపైనా ఒంగోలు పోలీసులు విచారణ జరిపారు. దాదాపుగా పదకొండు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు.

విచారణలో ఆర్జీవీ అసలు పోలీసులకు సహకరించలేదని తెలుస్తోంది. ఏ విషయం అడిగినా తనకు తెలియదు..గుర్తు లేదని అని చెప్పినట్లుగా భావిస్తున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ ను తాను మాత్రమే కాదని మరికొందరు మేనేజ్ చేశారని.. పొలిటికల్ పోస్టులన్నీ వాళ్లే పెట్టినట్లుగా చెప్పినట్లుగా చెబుతున్నారు. వాళ్లెవరు అన్నది మాత్రం చెప్పలేదని అంటున్నారు. వైసీపీకి తన ట్విట్టర్ అకౌంట్‌కు వర్మ అద్దెకు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నికల తర్వాత వర్మ.. తన అకౌంట్ నుంచి రాజకీయ పోస్టులు పెట్టడం లేదు. ఇంటర్యూల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు. కేసులు పెడతారని.. అరెస్టులు చేస్తారన్న భయంతో సైలెంటుగా ఉంటున్నారు. వైసీపీ ఉన్నప్పుడు రెచ్చిపోయిన పోసాని కూడా చాలా కాలం జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆర్జీవీని అరెస్టు చేయకపోవడంపై టీడీపీ, జనసేన క్యాడర్ లో అసంతృప్తి ఉంది. అయితే ఆయనపై ఉన్న కేసుల్లో ఏడేళ్లలోపే శిక్ష పడేవి కావడంతో అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.

Leave a Comment

ghostwriter seminararbeit
bachelorarbeit ghostwriter
ghostwriter service
avia masters
ghostwriter köln
ghostwriter seminararbeit
ruletka kasyno